వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం లోని ల్యాదేల్ల సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం రేపింది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసులకు సమాచారం ఇవ్వగ వారు వచ్చి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలు వివరాలు ఇంకా తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు
