వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల చిన్నచూపు తగదు

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై అనుసరిస్తున్న విధానం రైతాంగాన్ని తీవ్రంగా కలచి వేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవనంలో శుక్రవారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతులు పంటలను వేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు కల్తీ విత్తనాలు రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా నష్ట మిగుల్చుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్లనూ రైతాంగo పీకల్లోతు కష్టాల్లోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులను నిరాశ పరిచింది.
బడ్జెట్ లో రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రాజెక్టులు,రైతుల రుణాలు,రైతు బంధు,రైతు భీమాలకు పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కేటాయింపులు జరగలేదని అన్నారు. దీనితో పాటు రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేలా,అది అమలయ్యేలా ఉండాలని డిమాండ్ చేశారు. పంటకు కనీస మద్దతు ధర చట్టం,ఋణ విమోచన చట్టం,కౌలు రైతు ఋణ అర్హత కార్డుల జారీ,ధరణిలో నెలకొన్న సమస్యల పరిష్కారం,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వ ప్రాధాన్యత,ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా నష్టపోయిన పంటకి ఆర్థిక చెల్లిoచాలని తెలిపారు.

జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ రైతు సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు ఎండీ సర్దార్(రేగొడు), జిల్లా కార్యదర్శిగా లక్ష్మీ నరసయ్య(చేగుంట), ఉపాధ్యక్షులు వెంకట్ ఉప్పల(శంకరంపెట్), కిషన్ (శివంపేట), సిహెచ్ లచ్చాగౌడ్(హవేలీ ఘనపూర్), సహాయ కార్యదర్శులు బొంత బాగయ్య(వెల్దుర్తి), శెలిమేటి వెంకట్ గాంధీ(పాపన్నపేట) కమిటీ సభ్యులు సంగమేశ్వర, దుర్గేశ్, యాదగిరి లు ఎన్నికైనారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.