వ్యవసాయ విద్యుత్ మోటార్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంతగిరి పోలీస్ సిబ్బంది

29 కేసుల్లో 75 మాటర్లు దొంగతనం చేసిన ముఠా.

ముగ్గురు నిందితులు అరెస్ట్, పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు 40 మోటార్లు, రూ.2.15 లక్షల నగదు, ఒక బైక్, 2 సెల్ ఫోన్స్ సీజ్

-జిల్లాలో 8 మండలాల్లో, ఖమ్మం జిల్లాలో ఒక మండలంలో మోటార్ల దొంగతనానికి పాల్పడ్డ ముఠ

అనంతగిరి పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు ఎస్పీ ఎస్.రాజేంద్ర ప్రసాద్

పాత ఇనుము వాళ్లకు విద్యుత్ మోటార్లు అమ్ముతూ ఇళ్లలో, కాలువలు,బావులపై బిగించి ఉన్న విద్యుత్ మోటార్లను దొంగతనం చేసి పాత ఇనుము వారికే అమ్ముతూ జల్సాలు చేస్తున్న ఎనిమిది మంది దొంగల ముఠాను అనంతగిరి పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. శనివారం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విలేకర్ల సమావేశంలో నేరస్థుల వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… చిలుకూరు కు చెందిన సంపంగి నవీన్, కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కు చెందిన డేరంగుల శ్రీను, శివ, యాదగిరి,ఇరగదీండ్ల నాగరాజు, దండుగుల రాంబాబు, మహేష్ ,పల్లపు రాజశేఖర్ లు గతంలో పాత ఇళ్ల స్లాబులు కూల కొట్టుతూ ఇనుప చువ్వలు పాత ఇనుము వారికి అమ్ముకొని జీవనం గడిపేవారు. ఈ క్రమంలో ఓ పాత ఇంటిని కూల కొడుతుండగా ఓ పాత మోటార్ దొరికింది. దానిని గుర్తు తెలియని పాత ఇనుము వ్యక్తికి అమ్మగా 2500 రూపాయలు వచ్చాయి. దీంతో వారికి ఆశ పుట్టి విద్యుత్ మోటార్ లు దొంగతనం చేసి పాత ఇనుము అమ్ముకొని సులువుగా అధిక డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకొని దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. మొదటగా గత ఏడాది డిసెంబర్ 2న చిలుకూరు మండలం రామచంద్ర నగర్ గ్రామ సరిహద్దులు కాలువపై రెండు మోటర్లు దొంగలించారు. వీరిలో సంపంగి శ్రీను, దారా నవీన్ లు మోటార్ సైకిల్పై తిరుగుతూ ఎక్కడెక్కడ మోటార్లు ఉన్నాయని గమనించి రాత్రిపూట అందరూ కలిసి శ్రీను ఆటోలో వెళ్లి మోటార్లను విప్పి దొంగతనం చేసి ఆటోలో వేసుకుని పాత ఇనుము సామాను వారికి అమ్మడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నవీన్ శ్రీను యాదగిరి నాగరాజులు మొగలైకోట లో దాచిన రెండు మోటర్లు ఆటో లో వేసుకుని , మరో ఒక మోటార్ నవీన్ శ్రీను మోటార్ సైకిల్ పై తీసుకొని శనివారం తెల్లవారుజామున క్రషర్ మిల్లు సమీపంలో ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో వీరిని పట్టుకొని విచారించారు. వీరిలో నవీన్ ,శ్రీను. శివ లు పట్టుబడి కాగా మిగతా వారు పరారీ లో ఉన్నారు.సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం పరిధిలో 29 కేసుల్లో 75 విద్యుత్ మోటార్లు దొంగతనం చేసినట్లు నేరస్థులు ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. వీరి వద్దనుండి.2,15,000 నగదు,40 విద్యుత్ మోటార్లు ఒక ద్వీ చక్రవాహం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులు పట్టుకున్న డిఎస్పి రఘు, రూరల్ సీఐ ప్రసాద్, అనంతగిరి ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది రమేష్, రామారావు, జానీ పాషా, బండి శ్రీనివాస్, కుంభం శీను ,లను ఎస్పీ అభినందించారు.ఆయనవెంట రూరల్, పట్టణ, మునగాల, హుజూర్ నగర్ సి ఐ లు,ఎస్ ఐ లు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.