సీఎం సహాయనిది నుండి లబ్దిదారులకు 26,94,500 విలువైన చెక్కులు అందజేత
ప్రత్యేక చొరవతో మంజూరు చేయించిన ఎమ్మెల్యే
కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు
పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలం లోని పలు గ్రామాలకు చెందిన వివిధ అనారోగ్య కారణలతో చికిత్స పొందుతున్న లబ్దిదారులకు రూపాయలు 26,94,500( ఇరవై ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఐదువందల రూపాయలు) విలువైన చెక్కులను ఈరోజు హన్మకొండలోని వారి నివాసంలో లబ్దిదారులకు చెక్కులను అందజేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంది పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది నుండి రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ,వైద్యం చేయించుకొని ఆర్థిక స్థోమత లేని ప్రజలందరు సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని వారు అన్నారు..
ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం సహాయ నిధి ద్వారా తమకు అందించిన ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో మండల ఎంపిపిలు ,జడ్పీటీసీలు ,గ్రామ సర్పంచులు , ఎంపిటిషి లు తదితరులు పాల్గొన్నారు.