శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు కేటాయించిన జిల్లా ఎస్పి

కృష్ణాజిల్లా- మచిలీపట్నం

2020 సంవత్సరం బ్యాచ్ కు చెందిన నలుగురు ప్రొబేషనరీ ఎస్ఐలు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలవగ, వారికి ఈరోజు జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో ఉన్న ఖాళీల ఆధారంగా పోస్టింగ్ కేటాయిస్తూ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా విధుల్లోకి రానున్న probationary ఎస్ఐలతో ఎస్పీ గారు మాట్లాడుతూ ఇప్పటివరకు మీరు శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకొని వివిధ విభాగాల యొక్క పనితీరును గురించి తెలుసుకున్నారని, ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా విధుల్లో పాల్గొంటున్నారు కనుక, ప్రజలకు పోలీసుశాఖ తరపున అందించవలసిన సత్వర న్యాయాన్ని అందించేలా కృషి చేయాలని, నీతి, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖ కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, మరొకసారి ప్రొబేషనరీ ఎస్ఐలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు

నూతన ప్రొబేషనరీ ఎస్సైలు

PSI – 4178 జి. వాసు
PSI – 4182 ఏ. పద్మారావు
PSI – 4186 జి. వెంకటేష్
PSI – 4183 బి. అనూష

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.