ఆధాత్మిక కార్యక్రామాల్లో ప్రభుత్వం భాగస్వామ్యం .
ఆలయాలకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పూర్వ వైభవం తెచ్చింది .
శాంతినగర్ శివాలయానికి ఘనమైన చరిత్ర .
భవిష్యత్ తరాలకు పదిలంగా ఆలయాల చరిత్ర సంస్కృతి .
శాంతి నగర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ,అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు
శివపార్వతుల దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం అనంత గిరి మండల పరిధిలోని శాంతి నగర్ లో శివ రాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న అన్నదానం ,సాంస్కృతిక కార్యక్రమాల ను ఆయన ప్రారంభించారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ….. దేవతా మూర్తుల అనుగ్రహంతో ప్రజలు కరోన ,ఓమిక్రాన్ ఉపద్రవాల నుండి బయట పడ్డారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది అన్నారు. ఆలయానికి పూర్వ వైభవం రావడంతో ప్రజలు తండోపతండాలుగా ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటున్నారన్నారు. శాంతినగర్ శివాల యానికి ఘన మైన చరిత్ర ఉందన్నారు.ఆలయాల చరిత్ర ను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.భవిష్యత్ తరాలకు పదిలంగా ఆలయాల చరిత్ర సంస్కృతి అందిస్తా మన్నారు. ఇందుకు నిదర్శనం సీఎం కేసిఆర్ దేశం గర్వించదగ్గ స్థాయిలో యాదగిరి గుట్ట లో ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్నారన్నారు. ఆలయాలు ప్రజల విశ్వాసాలకు ప్రతీకలుగా నిలుస్తాయన్నా రు.అందుకే ప్రభుత్వం అన్ని మతాల విశ్వాసాలకు పెద్ద పీట వేస్తుందన్నారు. అనంతరం అన్న దానాన్ని, సాంస్కృతిక కార్యక్రమాల ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ లు చుండూరి వెంకటేశ్వర్లు, కవితా రాధా రెడ్డి, జడ్పిటిసి సభ్యులు ఉమ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ ,పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ ఎంపిటిసి అప్జల్, దాతలు, తదితరులు పాల్గొన్నారు.