మధిర శివాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఇక్కడి శివుడు మృత్యుంజయుడిగా పూజలు అందుకుంటున్నారు. వైరా నది తీరాన ఈ శివాలయం ఉండటం, నది దక్షిణాభిముఖంగా పయనించటంతో ఈ ఆలయానికి దక్షిణ కాశీగా పేరు వచ్చింది. 5 రోజుల పాటు జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఖమ్మం జిల్లా తో పాటు పక్క రాష్ట్రమైన కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా భక్తులు రానున్నారు. భద్రతతోపాటు,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత వైభంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, చైర్మన్, పాలకమండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు