అసుంత భవన్, హనుమకొండ (డి మార్ట్ ఎదురుగా) నందు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దతుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యొక్క ముఖ్య మరియు పట్టభద్రుల సమావేశం మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి స్టేషన్ ఘనపూర్ కు చెందిన పలువురు ముఖ్య నేతలు, చైర్మన్లు, సర్పంచులు, యం.పి.టి.సి లుమరియు హాజరయ్యారు….
ఈ సమావేశం లో కడియం శ్రీహరి మాట్లాడుతూ తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ ప్రజలను ఎప్పటికీ మరచిపోలేనని కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. పార్టీలో అవమానాలు తమకు కొత్తకాదని…అన్నింటినీ దిగమింగి పార్టీకోసం పనిచేస్తామని కడియం శ్రీహరి అన్నారు. పార్టీ బలోపేతం కోసం సైనికుడిలా పనిచేస్తానన్నారు. పాండవులు, కౌరవులు విరోధులే అయినా…శత్రువు పై దండెత్తే విషయంలో అంతా ఒక్కటవుతామని…స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యకు, తనకు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి బేదాభిప్రాయాలు ఉన్నా…అందరం కేసీఆర్ సైన్యంలో భాగస్వాములమేనని శత్రువును ఓడించే విషయంలో అందరం కలిసిపనిచేసి శత్రువును మట్టికరిపిస్తామన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి …ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు.