రూ.75,000/- లను విరాళంగా గ్రామ సర్పంచ్ మరియు జాతర కమిటీ సభ్యులకు అందించిన …. గండ్ర
రేగొండ E69న్యూస్:జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం, రామగుండాలపల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించు కుంటున్న గ్రామ దేవతలు శ్రీ భూలక్ష్మీ – మహాలక్ష్మి – బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి శాసనసభాసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి,ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ ఈ రోజు రామగుండాలపల్లి గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నా గ్రామ దేవతలు శ్రీ భూలక్ష్మీ – మహాలక్ష్మి – బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేస్తూ,ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి,గ్రామ పెద్దలకు,ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ….
గ్రామ దేవతలు శ్రీ భూలక్ష్మీ – మహ లక్ష్మి అమ్మవార్ల ఆశ్శిసులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకుంటున్న అన్నారు.
ఈ జాతర సందర్భంగా రూ.75,000/- లను విరాళంగా గ్రామ సర్పంచ్, జాతర కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసి,మండల పార్టీ అధ్యక్షులు,పిఏసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్,డైరెక్టర్లు ఆలయ కమిటీ చైర్మన్,గ్రామ సర్పంచ్ లు,ఎంపీటీసీలు,గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.