శ్రీ సంతు సేవా లాల్ మహారాజు 283 వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
శ్రీ సంతు సేవా లాల్ మహారాజు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షలు కేటాయించిన ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ సంతు సేవా లాల్ మహారాజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు అని ఆయన జయంతిని పండుగలా జరుపుకోవడం సంతోషకరం గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలియ జేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించారని చరిత్రకారులు చెబుతారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. దీంతో శ్రీ సంత్‌సేవాలాల్ ఇతర కులాలవారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు
మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
గోవిందా రావు పేట వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రాసుపుత్ సీతారాం నాయక్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి దేవ్ సింగ్,మాజీ సహకార సంఘం చైర్మన్ రాజేశ్వర్ రావు,
డైరెక్టర్లు రమేష్, ఆర్శం రఘు,
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు,తారక్,తదితరులు పాల్గొన్నారు
