షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన బసవరాజు పల్లి లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన కుక్కముడి నర్సయ్య అనే వ్యక్తికి చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో ఉదయం నాలుగు గంటల సమయంలో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న బియ్యం బట్టలు వస్తువులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. సుమారు నాలుగు లక్షల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు వారి కుటుంబసభ్యులు తెలియజేశారు. ఇల్లు మంటల్లో దగ్ధం కావడంతో కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న నర్సయ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ చెరుకు కుమారస్వామి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు