సంక్షేమ హాస్టళ్ల మెనూ చార్జీలు పెంచే వరకూ ఉద్యమిస్తాం

ఖమ్మంలో స్థానిక సుందరయ్య భవన్ లో ఆగస్టు 2,3 తేదీల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి.ఈ సమావేశాల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో మెనూ చార్జీలు పెంచాలనీ తీర్మానం చేసారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు.నిత్యావసర వస్తువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయనీ,పప్పు,నూనెలు, కూరగాయలు,గుడ్లు గతం కన్నా 3 రెట్లు పెరిగాయన్నారు.కానీ ధరలు విపరీతంగా పెరిగినా విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే మెనూ చార్జీలు మాత్రం ఏమాత్రం పెంచడంలేదన్నారు.2017 లో నామమాత్రంగా ఛార్జీలు పెంచారనీ,ఇప్పుడు పెరిగిన ధరలకు ప్రభుత్వం అందించే ఛార్జీలకు మరింత వ్యత్యాసం ఉందన్నారు.తక్షణమే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల మెనూ చార్జీలు పెంచాలనీ,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు.మెనూ ఛార్జీలు పెంచే వరకూ ఉద్యమిస్తామనీ,మెనూ చార్జీల పెంపుకు ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.సిద్దిపేట,బాసర, మహబూబాద్ జిల్లాల్లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయనీ,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనీ, పరిమిత మెనూ చార్జీల వల్లనే నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడంలేదనీ, పౌష్టికాహారం అందక రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు.విద్యార్థులు రోగనిరోధక శక్తి క్షీణించి చనిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.ప్రభుత్వంసంక్షేమ హాస్టల్ విద్యార్థుల పట్ల వివక్షత తగదనీ,విద్యార్థులు తిరగబడితే ప్రగతి భవన్ వదిలి పారిపోవాల్సివస్తుందన్నారు.ఈ సమావేశంలో ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి,శంకర్,వనం రాజు,శంకర్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మిశ్రీన్ సుల్తానా,అనిల్,ప్రశాంత్, ఖమ్మం
జిల్లా కార్యదర్శి మధు,జిల్లా అధ్యక్షులు తుడుం ప్రవీణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.