సందర్శకులకు నో ఎంట్రీ

ఎగువ మానేరు జలాశయం వైపు సందర్శకులు ఎవరు వెళ్లకుడదు : రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారు..

ప్రజలు పోలీస్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి

గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున ప్రజలు, యాత్రికులు జలాశయాన్ని సందర్శించడానికి వెళ్లకూడదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటన జారీ చేశారు.

ఎగువ మానేరు జాలశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దుంకుతుందని, జలాశయం వద్దకు ఎవరూ కూడా వెళ్లరాదని ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరూ ఫోటోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని పేర్కొన్నారు. అలాగే జలాశయం పరిసరాలలో మద్యపానం సేవించరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ గారు ప్రకటనలో పేర్కొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.