అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం జమాత్ ఖలీఫా-హజరత్ మీర్జా మస్రూర్ అహ్మద్
ఈ69న్యూస్ వరంగల్ ఏప్రిల్30
ఈ పవిత్ర రమజాన్ నెలలో ఉపవాసముల ద్వారా ప్రపంచమంతటా ముస్లింలే కాకుండా చాలా సజ్జనులు సత్కర్మములు, దానధర్మములు,మైత్రి కార్యక్రమాలు చేపట్టినారు, ఇది కేవలం ఒక రంజాన్ నెల వరకు మాత్రమే పరిమితం చేయకుండా జీవితం మొత్తం ఈ రకమైన సద్భావన శాంతి సమానమైన వాతావరణం సృష్టించుటకు ప్రతి మానవుడు ప్రత్యేకించి ముస్లిం సోదరులు ప్రయత్నించాలని విశ్వవ్యాప్త అహ్మదీయు ముస్లిం సంస్థ అధినేత హజరత్ మీర్జా మస్రూర్ అహ్మద్ లండన్ కేంద్రంలోని ఇస్లామాబాద్ లో తన రమజాన్ నెల చివరి శుక్రవారం ప్రసంగంలో ప్రపంచ అహ్మదీయు ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. జగత్ మానవాళికి కారుణ్యంగా ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేయాలని ఆహ్వానం పలికారు.యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో మన ప్రార్థనలు,ప్రపంచ నేతల దుశ్చర్యల నుంచి మానవాళిని కాపాడ కలుగుతారని ఆశిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా 215 దేశాల్లో వ్యాపించి ఉన్న అనుయాయులు ఎం టి ఎ ఇంటర్నేషనల్ చానల్ ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొన్నారని అహ్మదియ్య ప్రచార కార్యదర్శి,మౌల్వీ ఎం ఏ జైనుల్ ఆబిదీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
