సన్నబియ్యం పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వం

జోగు ప్రకాష్ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు

జనగామ —-రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చౌక దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటూ నాసిరకం బియ్యంఇస్తున్నారని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు జోగు ప్రకాష్ అన్నారు సోమవారం పట్టణంలోని వివిధ రేషన్ షాప్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే జరిగింది ఈ సర్వే ను ఉద్దేశించి మాట్లాడుతూ
1 ప్రతి మనిషికి 10 కిలోలు సన్న బియ్యం ఇవ్వాలని
2 పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని
—-సన్న బియ్యం అని పేరుకే కానీ అన్నం వండితే దొడ్డు బియ్యం లాగానే ఉన్నాయని అంటున్నారు రేషన్ బియ్యాన్ని మళ్ళీ సన్న బియ్యం గా మార్చి ఇస్తున్నారని అన్నారు
——ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్ట గా రైతుల దగ్గర కో న్నటువంటి వడ్లను పట్టించి రేషన్ షాప్ లలో అందించాలని అన్నారు
లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో కుడికాల నాగరాజ్ ఎల్లమ్మ నరేష్ కుమార్ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.