సమస్యలపై అడిగితే విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి నెట్టేసిన జయ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం


విద్యార్థులకు న్యాయం చేయాలని కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని DYFI వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి దోగ్గేల తిరుపతి డిమాండ్
హన్మకొండ:పద్మాక్షి గుట్ట సమీపంలోని ఉన్న జయ నర్సింగ్ కాలేజీ హాస్టల్ లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 25వ తేదీన కాలేజీ ముందు ఆందోళన నిర్వహించిన విద్యార్థులను ప్రతీకార చర్యగా 250 మంది హాస్టల్ విద్యార్థులను కాలేజీ, హాస్టల్ పరువు తీశారు అనే నెపంతో హాస్టల్ నుంచి బయటికి వెళ్లగొట్టారు, ఇదేమని తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు చేసిన కార్యకలాపాల వల్లనే వారు అనుభవించాలని ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని సమాధానం చెప్తూ బుకాయిస్తున్నారు, 250 మంది విద్యార్థులు ఉండే హాస్టల్ బిల్డింగ్ దాదాపు 35 సంవత్సరాలు క్రితం నిర్మించారని హాస్టల్ బిల్డింగ్ పెచ్చులూడి పోతున్నాయని వర్షాకాలం వస్తే భద్రకాళి చెరువు నీరు తో హాస్టల్ ఆవ రణం నిండిపోతుంది అని, అయినా విద్యార్థులు భరించు కుంటూ వస్తూ నీటిలో నుంచి కాలేజీకి వెళ్లే వారని, హాస్టల్ బిల్డింగ్ లోని 30 నుంచి 40 మంది విద్యార్థులకు ఒకటే వాష్రూమ్ ఉండేదని, అది విద్యార్థులకు సరిపోయేది కాదనివిద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాష్రూమ్ నిర్మించాలని నీటి సౌకర్యం కల్పించాలనిహెల్త్ యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజుల వసులను నిలిపివేయాలని తీసుకున్న ఫీజులకు రసీదులు ఇవ్వాలని, పరీక్షల సమయంలో డ్యూటీలు వేయొద్దని ప్రతి సంవత్సరం అప్లికేషన్ ఫీజు తో అధిక ఫీజుల వసులను ఆపాలని విద్యార్థులు ఏదైనా అవసరం కోసం ఇంటికి వెళితే వచ్చిన విద్యార్థులకు పైన్ పేరుతో డబ్బులు వసూలు చేయడంఆపాలని కోరుతూ ఆందోళన నిర్వహించిన విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం కక్షసాధింపు చర్యగా ధర్నాలు చేసిన ఫలితంగానే నిలదీస్తారు అని మీరు దిక్కున్న చోట చెప్పుకో వాలని అందుకోసం బయటికి వెళ్లాలని ఉన్నపళంగా విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయడం వల్ల దిక్కుతోచని పరిస్థితిలో విద్యార్థులు రోడ్డున పడ్డారు, సమస్యలపై యాజమాన్యాన్ని అడగడమే మేము చేసిన తప్పు అని ఉన్నఫలంగా హాస్టల్ లో కాల్ చేయమంటే మేము ఎక్కడికి వెళ్లాలని నాలుగు సంవత్సరాల అగ్రిమెంటు విద్యార్థులకు కల్పించిన యజమాన్యం ధర్నా చేస్తే హాస్టళ్లను మరమ్మతులు చేయాలనే సాకుతో విద్యార్థులను బయటికి పంపించడం దుర్మార్గమని,హాస్టళ్లను మరమ్మతులు చేయాల్సి వస్తే కరోనా సమయంలో 9 నెలలు హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేశారని, విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్స్ ఇంటర్నల్ మార్పులు యజమాన్యం చేతిలో ఉంటాయి కాబట్టి వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా యజమాన్యం ప్రవర్తిస్తుందని, గతంలో సీనియర్ విద్యార్థులు గిఫ్ట్ గా ఇచ్చిన వాటర్ ప్లాంట్ కూడా ఒక బాటిల్ కు రెండు రూపాయలు వసూలు చేశారని ఇప్పుడు అది పూర్తిగా చెడి పోవడం వల్ల బయటనుంచి తాగునీరూ కొనుక్కుని వస్తున్నారు, విద్యార్థులను రోడ్డున పడేసిన జయ నర్సింగ్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.