vra_photos

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల సమస్యలు పరిష్కారమయ్యేవరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మద్దతుగా ఉంటుందని ఎమ్మెస్పీ జిల్లా కోఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వర మాదిగ వెల్లడించారు. తల్లాడ లో వీఆర్ఏలు గత కొన్ని రోజులుగా చేపట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఏపూరి మాట్లాడుతూ వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత లేకుండా తెలంగాణ ప్రభుత్వం వెట్టి చాకిరి చేపించుకుంటుందని ఆరోపించారు తక్షణమే వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించి పెన్షన్ తో పాటు 55 సంవత్సరాల నిండిన వారికి వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలనే తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు కోట బలరాం, గొడ్ల వెంకటరత్నం, ఏసు రత్నం, ముత్యాలమ్మ, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.