• శాయంపేట కస్తూర్బా గాంధీ స్కూల్, కాలేజీని సందర్శించిన జీఎస్సార్..
 • విద్యార్థినీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా..
 • విద్యార్ధులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలని సూచన..
 • పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..
  భూపాల పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు శాయంపేట మండలం:
  శాయంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను శనివారం(ఈరోజు) భూపాలపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు మండల పార్టీ కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు.
  ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి ని బోధనా తీరు, మెనూ ప్రకారం విద్యార్థినీలకు భోజనం అందిస్తున్నరా, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
  అనంతరం తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను సత్యనారాయణ రావు దృష్టికి తెచ్చారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, స్కూల్ యూనిఫామ్ లు ఇవ్వలేదని, తరగతి గదుల్లో ఫ్యాన్లు సరిగా తిరగడం లేవని, బెడ్స్ సరిపడా లేవని, తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కూడా లేవని, టాయిలెట్స్ కు డోర్స్ లేవని, కొన్ని సబ్జెక్టులు బోధించేందుకు అధ్యాపకులు లేరని తదితర సమస్యలను పలువురు విద్యార్థినిలు గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తెచ్చారు.
  అనంతరం వంటగదిలో భోజన, కూరల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల త్రాగే మంచి నీటి ట్యాంకు ను పరిశీలన చేశారు.
  అనంతరం మీడియాతో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ..
  కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినిలు చదువుకునేందుకు సీటు వస్తే తల్లిదండ్రులు సంతోషంగా పడతారని, వారి భవిష్యత్ బాగుంటుందని, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దోహద పడుతుందని భావిస్తారు. కానీ, ఇక్కడ వాస్తవ పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
  పలు సమస్యలతో విద్యార్థినిలు బాధ పడుతున్నారని తెలిపారు. వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను విజీట్ చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడామని హెచ్చరించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.