E69న్యూస్:జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం (2005) భూపాలపల్లి కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి అడిషనల్ సూపరిండెంట్ వి. శ్రీనివాసులు గారిని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి 2022 నూతన సంవత్సర క్యాలండర్ ను అడిషనల్ సూపరిండెంట్ శ్రీనివాసులు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం (2005) భూపాలపల్లి జిల్లా నియామక ఇంచార్జ్ గోపిరెడ్డి. కిరణ్ , మార్త.రంజిత్, సింగని. రాజ్ కుమార్, పల్లెర్ల. రాజు , జక్కుల. అనిరుధ్ తదితరులు పాల్గొన్నారు.