సామాజిక వేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉందని ఆయన అన్నారు


సామాజికవేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ గారు
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ రోజు రేపు భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మొదటిరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనాల అధ్యక్షతన సమావేశాలను ప్రారంభించడం జరిగింది ఈ సమావేశాల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా సామాజికవేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ గారు హాజరయ్యారు. అనంతరం నూతన జాతీయ విద్యా విధానం పై సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సామాజిక వేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉందని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాలలో కనీస వసతులకు మరియు వాటి అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా కామన్ విద్య ఎలా అమలు చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నూతన విద్యా విధానం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విద్య కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే ఈ విద్యావిధానం తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వ విద్య అభివృద్ధి చేయకుండా నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తే విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం ఉండదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులను, ప్రజలను చైతన్యవంతం చేయాలని మేధావి లోకానికి పిలుపునిచ్చారు.
అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల పట్ల ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాలయ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకొని దేశంలో విద్యా అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు లేని పక్షంలో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ రోజు సమావేశాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ రాజేష్ నాయక్ రాష్ట్ర కమిటీ సభ్యులు ముప్పిడి వెంకటేష్, సర్వేశ్ ,గణేష్ ,సతీష్, హర్షిత, లావణ్య, అనుపమ, రాహుల్, లతోపాటు వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొ న్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.