జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం లోని సముద్రాల గ్రామ శివారులో సముద్రాల గ్రామానికి చెందిన ముహమ్మద్ ఆజిమియా (35)అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.ఘన్పూర్ సీ ఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్సై రమేష్ నాయక్ లు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగింది.కేసు బుక్ చేసుకొని దర్యాప్తు చేసి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది