#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మన ఊరు మన బడి ప్రణాళికతో బడుల రూపురేఖలు మారుస్తాం .

టిఆర్ఎస్ ప్రభుత్వం సర్కారీ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి

పాఠశాలల బలోపేతానికి ప్రజలు భాగస్వాములు కావాలి .

విద్యతోనే సామాజిక మార్పు

పాఠశాల లు ఆధునిక దేవాలయాలు .

5 లక్షల వ్యయంతో నూతన సిసి రోడ్లు శంకుస్థాపన

పాలవరం లో జ్ఞాన సరస్వతి విగ్రహం ఆవిష్కరణ లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

సరస్వతి మాత అనుగ్రహంతో పాలవరం గ్రామంలో విద్యాకుసుమాలు వికసించాలని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం అనంతగిరి మండల పరిధిలోని పాలవరం ప్రాథమిక పాఠశాలలో జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… పాఠశాలలు ఆధునిక దేవాలయాలు అని విద్యార్థుల్లో విద్యా విలువలు పెంపొందించేందుకు సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెరాస ప్రభుత్వం మన బడి మన ఊరు ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి పాఠశాలల సదుపాయాలను కల్పించి బడుల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తుందన్నారు. మన ఊరు మన బడి ప్రణాళికలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత పాలకవర్గాలు పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం మూలంగా ప్రభుత్వ విద్యా రంగం వెనకబడి పోయింది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం, ఇంగ్లీష్ మీడియం, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు ఉచిత పాఠ్యపుస్తకాలు దుస్తులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు . అంకిత భావంతో విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని సూచించారు. మన ఊరు మన బడి పథకం తో బడుల రూపురేఖలు మారుస్తా మన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు ఎదగాలన్నారు. పాఠశాలలు ఆధునిక దేవాలయాలు అని ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లో భాగస్వాములు కావాలన్నారు . ఇటువంటి విగ్రహాల ఏర్పాటుతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందుతాయని కొనియాడారు . సరస్వతి దేవి విగ్రహ దాత సత్యనారాయణ శర్మ గారికి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గారు అభినందించారు. విద్యతోనే సామాజిక మార్పు వస్తుందని ఆయన తెలిపారు .ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి సభ్యులు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఐదు లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు శంకుస్థాపన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీలు వెంకటేశ్వర్లు, కవిత రెడ్డి, జడ్పీటీసీ ఉమ శ్రీనివాస రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్,ఎంఈఓ సలీం షరీఫ్, సర్పంచ్ నాగేంద్రమ్మ, ఎంపీటీసీ సంధ్య సైదులు, టిఆర్ఎస్ నాయకులు ఈదుల కృష్ణయ్య,విశ్వేశ్వరరావు, శ్రీనివాస్ రావు,మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, మాగి యాకోబు, వెంకటయ్య,,పుల్లయ్య గౌడ్,సయ్యద్ సైదులు,కసాని వెంకయ్య, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు .

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.