సర్పంచ్ స్థానాలకు పోటీ చేసిన టిడిపి మద్దతుదారులు విజయం

గుత్తి సమాచారం -: అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలంలోని ఉబిచెర్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు ఆదినారాయణ, లింగమయ్య , ఓబులేసు , చంద్రబాబు తో పాటు 10 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు టిడిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగముగా మండలం లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేసిన టిడిపి మద్దతుదారులు విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఊబిచేర్ల గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆదినారాయణను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకన్న టిడిపి నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.