#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

దళిత బంధు , రేషన్ కార్డులు, ఫించన్లు మంజూరు చెయ్యాలి

బి ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డిమాండ్

ఎల్కతుర్తి గ్రామంలో 294 సర్వే నెంబర్ లో ఉన్న చెరువు శిఖం భూమిని నిరుపేదలకు ఇండ్ల స్థలాలుగా కేటాయించాలని లేకుంటే గుడిసెలు వేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్ హెచ్చరించారు. ఇండ్ల స్థలంతో పాటు ఇండ్లు కట్టుకోవడానికి రూ 5.50 లక్షలు మంజూరు చెయ్యాలని, కొత్తగా అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు , దళిత బంధు మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు.
పేదల ధరకాస్తులు స్థానిక తహశీల్దార్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలం ఉన్నవారికే ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షల ఇస్తే ఇంటి స్థలం లేని పేదలు బతుకేమి కావాలి అన్నారు. చెరువు శిఖం భూమి గ్రామంలో ఉన్న పెత్తందారులు అక్రమించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆక్రమణ దారులకే అధికారులు , పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఇదే వైఖరి అనుసరిస్తే భూమిలో గుడిసెలు వేస్తామని , నిర్బంధంతో ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు. ఏప్రియల్ నుండే కొత్త పింఛన్లు ఇస్తామని మంత్రి హరీష్ రావు అంటున్నారని ఆచరణలో ధరకాస్తులు కూడా తీసుకోవడం లేదని అన్నారు.దళిత బందు నియోజవర్గానికి 100 మందికే ఇస్తామని అంటూ అధికార పార్టీ కార్యకర్తలు , నాయకులకే ఇస్తున్నారని పేదలను గాలికి వదిలేశారని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు , జిల్లా నాయకులు సతీష్, రవి, అశోక్, రజిత ,లోకిని స్వరూప , అంబాల స్వరూప ,భూపోరాట కమిటీ నాయకులు అంబాల మమత , జనగాన సరోజ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.