#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఈ69 వార్త జఫర్ ఘడ్/ఏప్రిల్1
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థన అనంతరం మసీహ్-ఎ-మౌఊద్ దినోత్సవం సమావేశం ఏర్పాటు చేశారు.స్థానిక అధ్యక్షుడు ముహమ్మద్ బాషామియ అధ్యక్షత వహించిన సమావేశానికి
ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదియ్య ముస్లిం జమాత్ ఉపాధ్యక్షుడు ముహమ్మద్ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సనాతన ధర్మం మొదలుకొని ఇస్లాం ధర్మం వరకు 1లక్ష ఇరవై నాలుగు వేల అవతార పురుషుల భవిష్య వాణీల ప్రకారమే హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం కలియుగ అవతార పురుషుడిగా 13ఫిబ్రవరి 1835 సంవత్సరములో భారతదేశం పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లా ఖాదియాన్ గ్రామంలో జన్మించారని,వారు దైవాజ్ఞతో23మార్చి1889సంవత్సరంలో సర్వ ధర్మ ప్రజలను ఐక్యమత్యం చేయుటకు నిజమైన సృష్టికర్త వైపుకు తీసుకు రావడంకోసం అహ్మదియ్య ముస్లిం జమాత్ ను స్థాపించారని,వారు అవతరించి ప్రపంచానికి నిజమైన ఇస్లాం ధర్మాన్ని అందంచారని,వారు26మే 1908వ సంవత్సరములో పరమ పదించిన తర్వాత రెండవ శక్తిగా ఖిలాఫత్ వ్యవస్థ ఏర్పడిందని,ప్రస్తుత 5వ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ గారి నేతృత్వంలో 215 దేశాలలో వివిధ మతాల ప్రజలను ఐక్యమత్యం చేయడంలో నిమగ్నమై ఉన్నారని,అందరితో ప్రేమ ద్వేషం ఎవ్వరితో లేదు అనే నినాదం అహ్మదియ్య ముస్లిం జమాత్ సారాంశమని అన్నారు.ప్రజలందరూ కలియుగ అవతార పురుషుడు మిర్జా గులాం అహ్మద్ గారిని విశ్వసించాలని కోరారు.అనంతరం స్ధానిక మౌల్వీ ముహమ్మద్ ముజఫర్ మాట్లాడుతూ అహ్మదియులు నిజమైన ధర్మాన్ని ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.అనంతరం ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు ముహమ్మద్ నజీర్,గ్రామస్థులు ఉపాధ్యక్షుడు నాసర్,యూత్ అధ్యక్షుడు అన్వర్, అహ్మద్ పాష,రియాజ్,మక్తుంఅలీ,యాకూబ్, అంకూషావలీ,నబీసాబ్,సూరారం బాషామియ,హాజీమియా,షాన్మియ,బషీర్,స్త్రీలు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.