ఈ69 న్యూస్ వరంగల్/మార్చి12
పంజాబ్ రాష్ట్రం,ఖాదియాన్ పట్టణములో మార్చి 15,16,17 తేదీలలో అహ్మదియ్య ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో జరుగబోయే సలహాల సమావేశంలో ఆంద్ర, తెలంగాణ,కర్నాటక,తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి అహ్మదియ్య సంస్థలోని వివిధ ప్రాంతీయ శాఖల నుంచి సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్న ప్రతినిధులు పాల్గొనుటకు ఈరోజు బయలుదేరుచున్నట్లు ఆ సంస్థ ప్రచార కార్యదర్శి మౌల్వీ యం.ఎ జైనుల్ ఆబదీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అహ్మదియ్య ముస్లిం జమాత్ కార్యక్రమాల గూర్చి విశ్లేషణతో కూడిన కార్యచరణ గురించి ప్రతీ సంవత్సరం సమావేశం జరుగునని,ఆ సమావేశంలో యావత్ భారతదేశం నుండి వివిధ రాష్ట్రాల నుండి అహ్మదియ్య ముఖ్య ప్రతినిధులు పాల్గొని సలహాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
