మున్సిపల్ పరిధి లో గల స్థానిక 27 వ వార్డ్ లోని అంగన్వాడీ కేంద్రాలు లో సామూహిక అక్షరాభ్యాసం వార్డ్ కౌన్సిలర్ చిరివేల్ల లక్ష్మి కాంతమ్మ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భం గా మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాతనే అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అయ్యాయి అని,గౌరవ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి పర్యవేక్షణ తో అంగన్వాడీ కేంద్రాలు మరింతగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ ఆఫీసర్ అన్నపూర్ణ,అంగన్వాడీ టీచర్ లు,ఆయాలు పాల్గొన్నారు.