#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

పరకాల: మార్చి 28 29 తేదీలలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు పరకాలలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది,
సమ్మెకు సంబంధించిన నోటీసును ఈరోజు పరకాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శేషు కార్మికులు నేతలు అందించడం జరిగింది.
సిఐటియు జిల్లా నాయకులు దొగ్గెల తిరుపతి మాట్లాడుతూ
గతంలో మునిసిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు పెంచాలని అనేకసార్లు పోరాటాలు, సమ్మె నిర్వహిస్తే ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ పెరిగిన వేతనాలు వారికి ఇవ్వడం లేదని తెలిపారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కార్మికుల వేతనాలు పెరగ లేకపోవడంతో చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నారని, గ్రేటర్ హైదరాబాద్ వరంగల్ మున్సిపాలిటీ లో ఇస్తున్నటువంటి వేతనాలు మున్సిపల్ నగర పంచాయతీ లో పనిచేస్తున్న వారికి సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంపు ఉద్యోగ భద్రత కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మడికొండ వరుణ్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ ఉపాధ్యక్షులు అక్రమ్, కార్మికులు సారయ్య, ఐలయ్య, సరోజన, విజయ్ ,సుధాకర్ పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.