రాజ్యాంగం, మానవ హక్కులపై దాడులకు వ్యతిరేకంగా ఆగస్టు 1వ తేదీ నుండి ప్రచారోద్యమం-
సీతారాం ఏచూరి

ఈ69న్యూస్ హనుమకొండ జులై 25

హనంకొండ:భారత రాజ్యాంగం, మానవ హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా సిపిఐ(ఎం) ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయస్థాయి ప్రచార ఉద్యమం నిర్వహించనుందని సిపిఐ (ఎం) అఖిల భారత జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సిపిఐఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస భవనంలో రాష్ట్ర కమిటీ సమావేశాలను సీతారామచూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30-31 వ తేదీలలో కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని, ఇందులో దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని ప్రేరేపించడం రాజ్యాంగం, మానవ హక్కులపై జరుగుతున్న దాడులపై చర్చించి ప్రత్యామ్నాయ విధానాలతో వామపక్షాలు, ప్రజాస్వామ్యక శక్తులను కూడగట్టి పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నార. 23వ అఖిల భారత మహాసభలలో చేసిన తీర్మానాలలో భాగంగా మోదీ ప్రభుత్వ సర్క్యులర్, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, ఆర్థిక స్వావలంబన పై దాడులు చేస్తుందని ఈ నాలుగింటిని పరిరక్షణకు సిపిఐ(ఎం)ఉద్యమిస్తుందన్నారు.
మౌలిక వసతులలో ప్రత్యామ్నాయ విధానాలు
-తమ్మినేని వీరభద్రం

మౌలిక వసతుల కల్పనే ప్రత్యామ్నాయ విధానంగా రాబోయే కాలంలో పోరాటాలు చేయాల్సిన అవసరంవుందని, ఈ మేరకు రాష్ట్ర కమిటీ సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కమ్యూనిస్టులు లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా? అనే ఆలోచన వచ్చేలా పోరాటాలతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందన్నారు. గతంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు దళితులకు మూడెకరాలు,పెన్షన్లు, పోడు భూముల పట్టాలు ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యారున్నారు. పోడు భూముల విషయంలో మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు అన్నారు.కేంద్ర ప్రభుత్వంపై నేపం మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. వరంగల్, హనుమకొండ నగరాల్లో పేదలు ఇళ్ల కోసం ఉద్యమిస్తే గర్భీనీ స్త్రీలను తన్నిన ఘటనలు ఇక్కడ జరిగాయన్నారు. అక్రమంగా ఎకరాల భూమిని కబ్జా చేస్తే పట్టించుకోని పాలకులు పేదలు గుడిసెలు వేసుకుంటే అణిచివేత చర్యలకు దిగుతున్నారు. వారి పోరాటానికి మద్దతు తెలుపడానికి వస్తుంటే మార్గమధ్యలో నన్ను అరెస్టు చేశారన్నారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్ అనే పదం ఉండదని సీఎం కేసీఆర్ చెప్పారని ఇప్పుడు పర్మినెంట్ అనే పదం తప్ప అన్ని పదాలు ఉన్నాయ్ అన్నారు. ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఏ విజయ రాఘవన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముహమ్మద్ అబ్బాస్,పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కే.వెంకటయ్య, ఎస్ మల్లారెడ్డి, పాలగుడు భాస్కర్, జీడి నర్సిరావు, మల్లు లక్ష్మి, టి.జ్యోతి జాన్ వెస్లీ, టీ.సాగర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.