మంత్రిని క‌లిసి విన్న‌వించిన ఆయా గ్రామాల ప్ర‌తినిధులు

ఈ69న్యూస్ ప‌టేల్ గూడెం(జ‌న‌గామ‌)జులై 27ః
పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళుతూ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం కుందారం (ప‌టేల్ గూడెం) క్రాస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలోని సింగ‌రాజుప‌ల్లి,ఆ చుట్టు ముట్టు గ్రామాల‌కు చెందిన ప‌లువురు మంత్రిని క‌లిశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఆ ప‌క్క‌నే ఉన్న చిన్న గుడిసె హోట‌ల్ ముందు ఆగారు.అక్క‌డే ప్ర‌యాణీకుల కోసం వేసి ఉన్న ఓ చైర్ మీద కూర్చున్నారు. వాళ్ళ‌తో కాసేపు మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా వారు సింగ‌రాజుప‌ల్లి గ్రామాన్ని నూతన మండ‌లంగా ఏర్పాటు చేయాల‌ని మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. అందుకు మంత్రి ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు.మంత్రిని క‌లిసి వారిలో దేవ‌రుప్పుల పిఎసిఎస్ చైర్మ‌న్ లింగాల ర‌మేశ్ రెడ్డి,మండ‌ల ప‌రిష‌త్‌ ఉపాధ్య‌క్షుడు క‌త్తుల విజ‌య్‌,పెద్ద మ‌డూరు స‌ర్పంచ్ పెద్దారెడ్డి,సింగ‌రాజుప‌ల్లి స‌ర్పంచ్ మ‌ల్లేశ్‌,నేల పోగుల స‌ర్పంచ్ దూస‌రి గ‌ణ‌ప‌తి,చిన్న‌మ‌డూరు ఎంపీటీసీ మ‌ల్లికార్జున్‌, ధ‌రావ‌త్ తండా స‌ర్పంచ్ గేమా,న‌ల్ల‌కుంట తండా స‌ర్పంచ్ రాజ‌న్న‌,టిఆర్ఎస్ పార్టీ మండ‌ల శాఖ ఉపాధ్య‌క్షుడు ఉమేశ్‌, పార్టీ సినియ‌ర్ నాయ‌కులు సంజీవ‌రెడ్డి,భిక్ష‌ప‌తి,బండి న‌ర్సింహులు,మేడ వెంక‌టేశ్,జోగు సోమ‌రాజు,వంగ అర్జున్‌ త‌దిత‌రులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.