మునగాల మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ వద్ద సిగ్నల్ లేకపోవడంతో పింఛన్దారుల అవస్థలుపడుతున్నారు. గత రెండు రోజులుగా నెట్వర్క్ సమస్యతో సిగ్నల్ లేకపోవడంతో ఆసరా పింఛన్ దారులు పోస్ట్ ఆఫీస్ వద్ద నిరీక్షిస్తున్నారు. వారికి కనీసం తాగునీరు, వసతి కూడా ఏర్పాటుచేయడంలేదని, తాగు నీరు లేక ఎండలోనే నిరీక్షిస్తున్నామని వాపోయారు. పోస్ట్మాస్టర్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.