ఈ69వార్త జఫర్ఘడ్ ఏప్రిల్05
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని గడ్డం యాకబాబునగర్ ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ లో సిపిఐ జఫర్గడ్ మండల మూడవ మహాసభ విజయవంతంగా జరిగింది.జనగామ జిల్లా నాయకులు జువారి రమేష్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా చాడ వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే,సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మరియు తక్కేలపల్లి శ్రీనివాస రావు సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు.మన దేశానికి స్వాతంత్రం వచ్చి75 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా పాలకవర్గాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజల పరిస్థితి ఆ గమ్యం గోచరంగా మారిందని నేడు దేశ సంపద ప్రజల ఆస్తి మొత్తం 75 శాతం పైగా కొద్దిమంది కార్పోరేట్ శక్తులు కోటీశ్వరుల చేతుల్లోకి డబ్బు వరద ప్రవాహంలా పారి శతకోటీశ్వరులు అవుతున్నారని,పేదలు నిరుపేదలుగానే ఉన్నారని అన్నారు.నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే,టెలికాం,విద్యుత్,బొగ్గు,విమానయానం,పోర్టులు,పెట్రోలియం,బ్యాంకులు,వంటి అనేక సంస్థలను ప్రైవేటుపరం చేయడమే కాకుండా రక్షణ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయడంతో దేశం పరాధీన భారత్ గా మారే ప్రమాదముందని,ఫలితంగా దేశ ప్రజలు తీవ్ర నష్టాలు కష్టాల పాలయ్యే అవకాశం ఉందన్నారు.ఇరు ప్రభుత్వాలు నిత్యవసర వస్తువుల ధరలను, పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు,కరెంట్ చార్జీలు,బస్సు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని,వెంటనే తగ్గించాలని,డిమాండ్ చేశారు.లేదా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే జనగామ జిల్లాకార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి,గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్,స్టేషన్ గణపురం మండల కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు కురపాటి విజయ్ కుమార్,జఫర్గడ్ మండల ప్రధాన కార్యదర్శి ఎండి యాకూబ్ పాషా,పార్టీ జిల్లా సమితి సభ్యులు బొమ్మినేని వెంకట్ రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండల గట్టుమల్లు,సిపిఐ మండల సహాయ కార్యదర్శి రడపాక సత్యం మండలంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
