#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

సిరికొండ ప్రశాంత్ హెచ్చరిక

మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రశాంత్

50 వేలు ఆర్థిక సాయం అందజేత

గణపురం ఎస్ఐ ని సస్పెండ్ చేసిన డిఐజి

E69న్యూస్ గణపురం:
ఈ నెల 12 వ తారీఖున బైక్ ఎన్.ఓ.సి విషయంలో ఓ బైక్ షోరూం యజమానితో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన సిరికొండ వీరాభిమాని పెండ్యాల ప్రశాంత్ ఘర్షణకు దిగగా బైక్ షోరూం యాజమాని గణపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ అత్యుత్సాహం ప్రదర్శించి ప్రశాంత్ ను చితకబాదినాడు. మళ్లీ తెల్లవారి పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలవడంతో ఎస్సై మళ్లీ కొడతాడన్న భయంతో ప్రశాంత్ ములుగు జిల్లా బండారుపల్లి సమీపంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు . కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హన్మకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శనివారం ప్రశాంత్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి తనయుడు సిరికొండ ప్రశాంత్ తమ అభిమాని మృతిచెందడంతో తీవ్రంగా స్పందించారు. హుటాహుటిన సుమారు 500 మంది సిరికొండ కార్యకర్తలతో ఘనపురం చేరుకున్నారు. దాంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు సిరికొండ ప్రశాంత్ తో ఫోన్ లో సంప్రదింపులు జరిపారు.మృతుడు పెండ్యాల ప్రశాంత్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఊరుకునే ప్రసక్తి లేదని సిరికొండ ప్రశాంత్ పట్టుబట్టడంతో గత్యంతరం లేక గణపురం ఎస్ఐ గుర్రం ఉదయ్ కుమార్ ను వరంగల్ డిఐజి నాగిరెడ్డి సస్పెండ్ చేశారు. ప్రశాంత్ మృతదేహం వరంగల్ ఎంజీఎం నుంచి ఇంటికి చేరే వరకు సిరికొండ ప్రశాంత్ తన అనుచర గణంతో వేచి చూశారు. మృతదేహాన్ని తొందరగా అప్పగిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు శనివారం అర్ధరాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం ఉదయం మృతదేహానికి సిరికొండ ప్రశాంత్ ఘన నివాళులు అర్పించి 50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తక్షణ సాయంగా 25 వేల రూపాయలు కుటుంబీకులకు అందజేశారు. మిగతా 25 వేల రూపాయలు దశదిన కర్మ రోజు అందజేయనున్నారు. అలాగే తమ అభిమాని పెండ్యాల ప్రశాంత్ కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటామని తెలియజేశారు.
ఈ సందర్భంగా సిరికొండ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ మంచితనాన్ని అలుసుగా తీసుకొని తక్కువ అంచనా వేయొద్దు అని ప్రశాంత్ అన్నారు. మనసున్న మారాజు సిరికొండ మాదన్న సహనం అనే బాటలో నడవాలని మాకు, మా కార్యకర్తలకు, అభిమానులకు సూచించినందున ఎంతో ఓపికతో ఉంటున్నామని, దాన్ని అలుసుగా తీసుకుని చేతగాని తనంగా భావించి మా అభిమానులకు, టిఆర్ఎస్ పార్టీ మా కార్యకర్తలకు ఎవరైనా ఏదైనా హాని తలపెడితే సహించేది లేదని తెలిపారు. మీకు ఎవరైనా ఏమైనా హాని తలపెడితే ధైర్యంగా మాకు చెప్పాలి తప్ప, ఎవరు కూడా అధైర్యపడి భయంతో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ వద్దని, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేసి మిమ్మల్ని కాపాడుకుంటామని కార్యకర్తలకు, సిరికొండ అభిమానులకు ప్రశాంత్ తెలియజేశారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి గతంలో మరియు ఇప్పుడు ప్రజలకు చేస్తున్న మంచి పనులను నిర్భయంగా జనానికి వివరిస్తున్న విలేకరులను బెదిరిస్తూ, భౌతిక దాడులకు దిగుతున్న కొంతమంది చెంచాగాళ్లు తమ పద్ధతి మార్చుకోవాలని ప్రశాంత్ హెచ్చరించారు. అలాగే తమ పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఇబ్బంది పెడుతున్న కొంతమంది అధికారులు కూడా తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.