సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

డా”మొండితోక.జగన్ మోహన్ రావు …

నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతులు తీసుకువచ్చిన పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని శాసనసభ్యులు డా”మొండితోక.జగన్మోహనరావు పేర్కొన్నారు ,

నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిర్వహిస్తున్న సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు ,ముందుగా రైతులతో మాట్లాడి పత్తి కొనుగోలు విధానాన్ని ,వసతులను అడిగి తెలుసుకున్నారు ,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా”జగన్ మోహన్ రావు గారు మాట్లాడుతూ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకువచ్చే పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు, నిబంధనల పేరుతో పత్తి కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు ,

ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి :

ధాన్యం ,మొక్కజొన్న తదితర పంటల మాదిరిగా పత్తిని కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేసినట్లు డా”జగన్మోహన్ రావు పేర్కొన్నారు ,పత్తి అమ్ముకునేందుకు రైతులు పడుతున్న అవస్థలను ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు ,ఇటీవల కురిసిన వర్షాలు వరదల కారణంగా రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ,వరదలకు దెబ్బతిన్న పంటలను సైతం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మార్కెటింగ్ ,సీసీఐ ఉన్నతాధికారులకు ఫోన్లో సూచించారు ,

సమయపాలన పాటించాలి :

సీసీఐ కొనుగోలు కేంద్రం బయ్యర్ సమయపాలన పాటించడం లేదని పలువురు రైతులు తన దృష్టికి తీసుకు వచ్చారని డా”జగన్మోహన్ రావు పేర్కొన్నారు ,సీసీఐ నిబంధనల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్తి కొనుగోలు చేయాలని సూచించారు ,ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు ,గోనెల.సీతారామయ్య, మార్త.శీను, మహమ్మద్.మస్తాన్ ,పాములపాటి.రమేష్ తదితరులు పాల్గొన్నారు .

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.