janagama news

మూతపడ్డ రైస్ మిల్లులను తెరిపించి మిల్లు కార్మికుల ఉపాధిని కాపాడాలి

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు

జనగామ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన 1500 కస్టం మిల్లులను వెంటనే తెరిపించాలని అందులో పనిచేస్తున్న రైస్ మిల్లు కార్మికుల ఉపాధిని కాపాడాలని సీఐటీయూ జనగామ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు డిమాండ్ చేశారు.
శుక్రవారం రోజున స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి,అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందిచారు.ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1500 రైస్ మిల్లు జూన్ 7వ తేదీ నుండి మూతపడ్డాయని అందులో పనిచేస్తున్న సుమారు రెండు లక్షల మంది కార్మికులు, మిల్లు డ్రైవర్, దినసరి కూలీలు ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్, ఉపాధి కోల్పోతున్నారని కావున మూతపడిన రైస్ మిల్లులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 1979 ఆంధ్ర రాష్ట్ర వలస కార్మికుల చట్టం ప్రకారం వలస కార్మికులకు పనులు లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వరద కార్మికులను ఆదుకోవాలని వలస కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వానికి అవేమీ పట్టడం లేదన్నారు. మొన్న జరిగిన కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సీ ఐ ద్వారా సీ ఎమ్ ఆర్ బియ్యాన్ని కొనుగోలు చేయడం నిలిపివేయడం వల్ల రైస్ మిల్స్ వ్యవస్థ సంక్షోభంలో కి వెళ్ళింది అన్నారు. మిల్లుల యాజమాన్యాలు గత రెండు సీజన్లలో రైతుల నుండి ధాన్యం సేకరించి వాటిని మిల్లింగ్ చేసి సిఎంఆర్ బియ్యంగా మార్చి ఆ బియ్యాన్ని అమ్మకానికి సిద్ధం చేసిందన్నారు. కానీ ఎఫ్సిఐ కొనుగోలు చేయకపోవడంతో రైస్ మిల్లు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ కింద ఇచ్చిన 2022 ఏప్రిల్ మే నెలలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని సరఫరా చేయకుండా మధ్యలో మానివేయడం వేయడం వల్లనే ఈ స్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ప్రజలకు నష్టం కలిగించే చర్యలు మానుకొని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మూతపడ్డ బిల్లులను వెంటనే తెరిపించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సి ఎం ఆర్ బి అన్ని కొనుగోలు చేసి పనులు కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి వలస వచ్చిన వలస కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సుంచు విజేందర్, మల్లేష్ రాజ్ బూడిద ప్రశాంత్,md మునీర్,నాగరాజు,నవీన్,md మైబెల్లి,శ్రీనివాస్,కృష్ణ,మహేందర్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.