సి.ఐ.కె. సృజన్ రెడ్డి గారిని సన్మానించిన ఫోరం ఫర్ ఆర్.టి.ఐ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు

జమ్మికుంట సి.ఐ.కె. సృజన్ రెడ్డి గారిని సన్మానించిన ఫోరం ఫర్ ఆర్.టి.ఐ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి 💐💐💐💐💐💐దివి:09-01-2020 రోజున జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సృజన్ రెడ్డి గారిని ఫోరం ఫర్ ఆర్.టి.ఐ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి షాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ ఉత్తమ పోలీసు స్టేషన్ జాబితాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా కు చెందిన జమ్మికుంట పోలీసు స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా 10 వ స్తానంలో నిలిచి అవార్డు అందుకోవడం చాలా గొప్ప విషయం అని అందుకోసం నిరంతరం కృషి చేసిన సి.ఐ సృజన్ రెడ్డి గారికి మరియు ఎస్.ఐ ప్రవీణ్ రాజ్ గారు మరియు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మిగతా సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రం లోని యువత సి.ఐ సృజన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు.ఈ రోజు సి.ఐ సృజన్ రెడ్డి గారిని సన్మానించడంచాలాసంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.