సి ఐ టి యు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి టి రణదివె వర్ధంతి

సి ఐ టి యు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి టి రణదివె గారి వర్ధంతి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కే చంద్రశేఖర్ జిల్లా కన్వీనర్ కె రాజనర్సు సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ దేశంలో కార్మికులకు కర్షకులకు అసంఘటిత కార్మికులకు కిందిస్థాయి కార్మికులందరికీ ఒక బలమైన నిర్మాణమైన సంఘం కావాలని ఆ సంఘం నిరంతరం కార్మికుల కష్టజీవుల కోసం పనిచేయాలని బీటీ రణదివె మరెంతో మంది నాయకులు సి ఐ టి యు యూనియన్ను స్థాపించినవారిలో బీటీ రణదివె గారు ఎనలేని కృషి చేశారు వారి కృషి ఫలితంగానే సి ఐ టి యు సంగం ఏర్పాటు జరిగింది ఆరోజు జరిగిన నిర్మాణంలో భాగంగా నేటికీ సి ఐ టి యు యూనియన్ అనేక సమస్యల పైన నేటికీ పోరాడుతూనే ఉన్నది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలు పెంచి పేద ప్రజల కార్మికుల ఉన్నది నడ్డి విరుస్తుంది నేటికి కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు కార్మికులకు పర్మినెంట్ చేయకపోవడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయడంలో విఫలమయ్యాయి కామ్రేడ్ బి టి రణదివె గారి ఆలోచన విధానాలను వారి ఆశయ సాధన కోసం సి ఐ టి యు నిరంతరం పోరాడుతుందని వారి ఆశయ సాధన కోసం కార్మికులు కర్షకులు ప్రజలు ఐక్యమై చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎం సంతోష్ మున్సిపల్ కామారెడ్డి పట్టణ అధ్యక్షులు వీరయ్య పట్టణ కార్యదర్శి మరియు మరియు కార్మికులు. తేజ .సాంబయ్య .గంగాధర్. యాదగిరి. సాయిలు. రాజు కార్మికులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.