#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జఫర్ ఘడ్/ మార్చి20
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 22,36,500 రూపాయలను లబ్దిదారులకు మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నేడు అందించారు.
స్టేషన్ ఘనపూర్,చిల్పుర్, రఘునాథ్ పల్లి,లింగాల ఘనపూర్, జఫర్ గడ్, ధర్మసాగర్,వేలేరు తదితర మండలాలకు చెందిన లబ్దిదారులకు నేడు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి ఈ చెక్కులు పంపిణీ చేశారు.
జఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన వేల్పుల సాయిలు గత సంవత్సరం కరోనా బారిన పడి చనిపోగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి ప్రభాకర్ చొరవతో మాజీ ఉపముఖ్యమంత్రి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి గతంలో (మొదటి సారిగా) 3,50,000 ఇవ్వగా,ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 48,000,కరోనా నష్టపరిహారం క్రింద 50,000,రైతు భీమా ద్వారా 5,00000 చెక్కులను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేతుల మీదుగా అందుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వానికి,మరియు కడియం శ్రీహరి,మరియు మారపల్లి ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.