#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

స్టేషన్ ఘనపూర్ ఇంచార్జ్ సింగపురం ఇందిరా
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్/మార్చి06
హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో సీఎల్పీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే లు మరియు డీసీసీ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి,స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింగపురం ఇందిర పాల్గొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఇస్తానన్న
డిగ్రీ కాలేజీ త్వరగా ఏర్పాటయ్యే విధంగా మరియు లెదర్ ఇండస్ట్రీ కి కావలసిన నిధులను వెంటనే విడుదల అయ్యేలా మరియు యు దళితులకు మూడెకరాల భూమి , దళిత బంధు అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగా కోరారు. పలు సమస్యలను సీఎల్పీ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్బంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎల్పీ లేవనెత్తాల్సిన అంశాలపై జిల్లా మరియు కంటెస్టెంట్ ఎమ్మెల్యేలు పలు సూచనలు తెలియపరిచారు.
కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో తెలంగాణకు హామీ ఇవ్వబడింది.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాల్సిందిగా, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ బయ్యారం ఉక్కు కర్మాగారం అంశాల గురించి సీఎల్పీ డిమాండ్ చేయాలని సూచించారు.
రైతు సమస్య, నిరుద్యోగ సమస్య, దళితబంధు అమలు విషయంలో అధికార పార్టీ ప్రభుత్వ వైఫల్యంపై చర్చించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి సీఎల్పీ నాయకత్వానికి సూచించారు.రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ కాలేదని కొత్త అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని సీఎల్పీ దృష్టికి తీసుకువెళ్లారు.అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో ఈ మధ్య కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని కావున రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రాబోయే అసెంబ్లీ సమావేశంలో సీఎల్పీ లేవనెత్తాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి మరియు నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎమ్మెల్యే సీతక్క ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.