suryapet news

48 వార్డులకు 48 దోమల మందు స్ప్రేయింగ్ మిషన్లు

  • పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్

వర్షాకాలం నేపథ్యంలో ప్రజలను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించేందుకు సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దోమల పై సమరం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 48వార్డులలో దోమల నివారణకు ఏర్పాటు చేసిన 48 స్ప్రేయింగ్ మిషన్లను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. మురికి కాల్వల్లో వీధుల్లో నీరు నిలిచి దోమల లార్వా అభివృద్ధి చెంది దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు. దోమల వృద్ధిని అరికట్టి ప్రజలను అంటు వ్యాధుల నుంచి రక్షించేందుకు స్ప్రెయింగ్ మిషన్లతో పాటు, ఫ్యాగింగ్ మిషన్లతో దోమల మందు పిచికారి చేయనున్నట్లు తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలను వ్యాధుల నుంచి రక్షించేందుకు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారని అన్నారు. కరోన సమయంలో సైతం మున్సిపల్ సిబ్బంది అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ప్రతి వార్డులో ప్రతిరోజు వార్డు కౌన్సిలర్ ను సంప్రదించి పారిశుధ్య సిబ్బంది దోమల మందు పిచికారీ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఇండ్ల ముందు నీటితొట్టిలో నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, బండ జనార్ధన్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ , మున్సిపల్ జవాన్లు పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.