సీతక్క ను విమర్శించే స్థాయి అర్హత రేఖ నాయక్ కు లేదు

లంబాడీ ల ఆత్మ గౌరవం దెబ్బ తినే విధంగా కెసిఆర్ ను సేవా లాల్ తో పోల్చడం ఎంటి
ఇందిరా గాంధీ బిక్ష వల్ల అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా నువ్వు ప్రభుత్వ ఉద్యోగం లో మీ ఆయన ఉన్నాడు
రేఖ నాయక్ సీతక్క కి క్షేమ పన చెప్పాలి
రేఖ నాయక్ నీ పద్దతి మార్చుకో
తీవ్ర స్థాయిలో మండి పడ్డ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ గారు మాట్లాడుతూ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశములో ఎమ్మెల్యే రేఖ నాయక్ గారు కెసిఆర్ ను లంబాడీలు ఆరాధ్య దైవం గా పూజించే సేవా లాల్ మహారాజు తో పోల్చడం సిగ్గు చేటని లంబాడీల ఆత్మ గౌరవం దెబ్బ తినే విధంగా అసెంబ్లి సాక్షి గా రేఖ నాయక్ మాట్లాడటం బాధాకరం అని రేఖ నాయక్ గారు లంబాడీ జాతికి క్షేమపాన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు
ఇందిరా గాంధీ పుణ్యమాని ఈ రోజు రిజర్వేషన్ ద్వారా నువ్వు ఎస్టీ ఎమ్మెల్యే గా నీ భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా సంగతి మర్చిపోయి అసెంబ్లీలో ఏమి మాట్లాడా లో తెలియక ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
కరోనా కష్ట కాలములో ములుగు నియోజకవర్గం లోని తండాలకు ప్రతి గూడెం లో ప్రజలకు అండగా ఉండి సేవ చెయ్యడమే కాకుండా పక్క రాష్ట్రం లు ఆంధ్ర ప్రదేశ్,ఒరిస్సా,ఛత్తీస్ ఘడ్ ,రాష్ట్రములోని పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్క డికి వెళ్లి అన్నర్ధుల ఆకలి తీర్చిన గొప్ప మనస్సు ఉన్న నాయకురాలు మా సీతక్క గారిని విమర్శించే స్థాయి అర్హత రేఖ నాయక్ లేదని కరోనా కష్ట కాలములో రాష్ట్రం లో ఒక్క ఎమ్మెల్యే కూడా చెయ్యని సాహసం సీతక్క గారు దైర్యం గా ముందుండి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించి పేద కుటుంబాలకు అండగా ఉన్నా గొప్ప నాయకురాలు అలాంటి మా నాయకురాలు సీతక్క ను విమర్శించే ముందు నీ స్థాయి ఎంటో తెలుసుకొని మాట్లాడాలని వెంటనే సీతక్క గారికి రేఖ నాయక్ క్షేమాపణ చెప్పాలని లేని యెడల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యములో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముషిన పెల్లి కుమార్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్
సర్పంచ్ రత్నం భద్రయ్య,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు అలో త్ దేవ్ సింగ్,
యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శి అలోత్ తారక్,వార్డు సభ్యులు రవి
యూత్ కాంగ్రెస్ మండల నాయకులు శరత్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.