సీతారాంపురం పాఠశాలలో ఘనంగా డాక్టర్ జగ్జీవన్ రాం వర్ధంతి

మరిపెడ మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బయగాని రామ్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబూజీ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గా సంఘ సంస్కర్త గా, రాజకీయ వేత్త గా, ఉప ప్రధాని గా ఎన్నో సేవలు చేశారని, వారు కేంద్ర శాసన సభ్యులుగా, కేంద్ర మంత్రి గా అందరి మన్ననలు అందుకున్నారని అన్నారు. కావున వారి పుట్టిన రోజును ” ఘనంగా” జరుపుకుంటామని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, వెంకటేశ్వర్రావు, ఇందిరా, నిర్మల, ఫిరోజ్ ఖాన్, నగేష్, మేరిశీల, ప్రసాద్, శంకర్, ప్రేమ్ సాగర్, హరి, రాజకుమారి, వెంకన్న, సురేష్, సఫియా బేగం, ఉమా దేవి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.