#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

స్టేషన్ ఘనపూర్ మండల కార్యదర్శి-కురపాటి విజయ్ కుమార్
ఈ69న్యూస్ జఫర్ ఘడ్/మార్చి21
ఏప్రిల్ 5వ తేదీన జరుగనున్న సీపీఐ 3వ మండల మహాసభను జయప్రదం చేయాలని స్టేషన్ ఘనపూర్ మండల కార్యదర్శి,జఫర్ఘడ్ మండల పార్టీ నిర్మాణ బాధ్యులు కూరపాటి విజయ్ కుమార్ కోరారు. ఈ రోజు జఫర్ ఘడ్ మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మండల కార్యదర్శి ముహమ్మద్ యాకుబ్ పాషా అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.గడిచిన నాలుగు యేండ్లలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని,గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం మహాసభను నిర్వహించుకుంటున్నామని, ఈ మహా సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు,పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు.
ఈ మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డిలు ముఖ్య అతిధిగా పాల్గొననుట్లు తెలిపారు.
ఈ రోజు జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఏఐటియుసి జిల్లా నాయకులు తోట రమేధా,బోమ్మినేని వెంకట్ రెడ్డి,జిల్లా నాయకులు జువారి రమేష్,ఆర్ సత్తయ్య మండల గట్టుమల్లు,ఆర్ యాదగిరి, సీనియర్ నాయకులు కురపాటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.