సీసీ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చు

సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను కొంతమేరకైనా నియంత్రించవచ్చునని ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలోని 30 వ వార్డు రెడ్డి కాలనీలో స్థానిక కౌన్సిలర్ మాడ.కమల లక్ష్మారెడ్డిల ఆధ్వర్యంలో సీసీ కెమెరాల అవగాహన సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమానికి సిఐ రాజి రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సీసీ కెమెరాల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.రెడ్డి కాలనీలో ప్రజా సముదాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చునని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని సిఐ రాజి రెడ్డి పిలుపునిచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలి అని అప్పుడే నేరాలను నియంత్రించవచ్చని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా కెమెరాలు ఉపయోగపడతాయని సీఐ రాజిరెడ్డి గారూ స్పష్టం చేశారు. యువత పెడదారి పట్టకుండా గంజాయి మాదకద్రవ్యాల 20 వాటికి దూరంగా ఉండాలని సిఐ గారు సూచించారు.అనంతరం కాలనీవాసులు సీఐతో పాటు పలువురు పోలీసు అధికారులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు అభినవ్, స్వప్న కుమారి టీజేఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాడ.హరీశ్ రెడ్డీ మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
హరీష్ రెడ్డి తెరాస 30వ వార్డు అధ్యక్షులు కేటీ చిత్ర జన్ కాలనీ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.