#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

జడ్పీటీసీ గొర్రె సాగర్

E69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామంలో RWS AE అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీళ్లపై వినియోగంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిధులుగా పాల్గొన్న జడ్పీటీసీ గొర్రె సాగర్,జడ్పీటీసీ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీటిలో మినరల్స్‌ ఉంటాయని, ఈ నీటినే తాగాలని సూచించారు. మార్కెట్లో అమ్మే డబ్బా నీటిలో జీవం లేదని, ఆ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అని అభిప్రాయపడ్డారు. ప్యూరిఫైడ్‌ నీటిలో కెమికల్స్‌ ఎక్కువ వాడుతుండడంతో కీళ్ల, బొక్కల నొప్పులు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ మల్లేష్‌ పరికరాల ద్వారా నల్లా నీటి ప్రాముఖ్యాన్ని వివరించారు.అనంతరం SC బాలికల వసతి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాను అధికారులతో కలిసి, ప్రారంభించారు.
ఈ సదస్సులో మిషన్ భగీరథ SE రాంచంద్, DE పరమేశ్వరి, మధు కుమార్, స్థానిక గ్రామ సర్పంచ్ పుట్టపాక మహేందర్, ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షుడు జంబుల తిరుపతిమరియు స్థానిక గ్రామానికి చెందిన ప్రజలు, నాయకులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.