సూర్యాపేటలో ఐటి హబ్ రానున్న ఆరు నెలల కాలంలో కొలువుల జాతర

రానున్న ఆరు నెలల కాలంలో సూర్యాపేట జిల్లా కేంద్రం గా కొలువుల జాతర మొదలుకానుంది ఇటీవల రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా నుండి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే దీనిపై సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి బుధవారం సాయంత్రం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటూ ఐటీ హబ్ పై సుదీర్ఘ వివరణ ఇచ్చారు ఐటి హబ్ ఏర్పాటు పై రెండు నెలల క్రితమే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై చర్చించినట్లు వెల్లడించారు. ఐటి హబ్ ఏర్పాటు పై ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ ఐటీ నిపుణులు ఒకరు తను కలిసినట్టు ఐటి హబ్ సూర్యాపేట లో ఏర్పాటు చేస్తానని సుముఖతను వ్యక్తం చేసినట్లు చెప్పుకొచ్చారు సూర్యాపేటలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని ఆంధ్ర ప్రదేశ్ ఆ పరిస్థితి లేదని ముఖ్యంగా సూర్యాపేట రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉందని ఆ నిపుణులు చెప్పినట్లు చెప్పారు మరో రెండు మూడు నెలల కాలంలో 50 మంది నుంచి 200 మంది ఐటీ ఉద్యోగులతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పై భాగాన ఖాళీగా ఉన్న బ్లాక్లలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు ఇంకా అంతకంటే మంచి భవనాన్ని చూపించిన దాని రిపేర్ ఖర్చులను తామే భరించి ఐటీ హబ్ ను ప్రారంభిస్తామని తెలిపినట్లు మంత్రి చెప్పుకొచ్చారు రానున్న కాలంలో మన కొలువులు మన స్థానికులకే అన్న చందంగా నియోజకవర్గ నిరుద్యోగులకు అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి కొలువులలో తీసుకోనున్నట్లు తెలిపారు అన్ని అనుకున్నట్లు జరిగితే సుమారు 4 నుంచి 5 వేల మంది సూర్యాపేట ప్రాంతవాసులు ఐటీ కొలువులు సొంతం చేసుకుంటారని మంత్రి తెలియజేశారు తాను ఈ వారంలో అమెరికా పర్యటనకు వెళ్తున్నానని అక్కడ దీనిపై పూర్తిగా చర్చించనున్నట్లు తెలిపారు గతంలో సూర్యపేట ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిన సుధాకర్ పివిసి అధినేత మీలా సత్యనారాయణ పేరు ఉండేది మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో నిరుద్యోగులకు ఐటీ కొలువులు ఇక్కడే దొరికినట్టు అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంత్రి జగదీష్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోనున్నాడు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.