బీఎస్పీ సూర్యాపేట
అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్
స్టాలిన్ అంబేద్కర్

గడిచిన కొన్ని దశాబ్దాలుగా సూర్యాపేట నియోజకవర్గం నుండి బీసీల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా బీసీని సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వకపోవడం బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు స్టాలిన్ అంబేద్కర్ బహుజన్ అన్నారు,
సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ ఉంటే ప్రతిసారి ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఓట్లు తక్కువ వున్న అగ్రకుల అభ్యర్థులు మాత్రమే గెలవడం ఏంటని ప్రశ్నించారు, అదేవిధంగా సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థులుగా బిజెపి నుంచి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ నుంచి ఈ మూడు పార్టీల నుండి అగ్రకుల నాయకులే పోటీ పడడం
గమనించాలి అన్నారు,
వీళ్ళని గెలిపించినంతకాలం మనం బానిసత్వం లోనే ఉంటామని, మనల్ని బానిసలుగా చేసుకునే విధానం వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారని ఆయన అన్నారు.
ఈ మూడు పార్టీల అగ్రకుల నాయకులను కష్టపడి గతంలో గెలిపించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ గెలిచిన తర్వాత ఈ పార్టీలన్నీ పక్కన పెట్టాయని అధికారాన్ని వాళ్ళ అనుభవిస్తూ బహుజనులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేసి ఎంత చేసినా సొమ్మొకడిది సోకొకడిది ఊరొకడిది పెరోకడిది అనే విధంగా ఉందని అన్నారు,
మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లతో గెలిచి అధికారాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారని
వివిధ రకాలైనటువంటి కాంట్రాక్టులు గాని , పథకాలు గాని వాళ్ళ అగ్రకుల వర్ణ వ్యవస్థలకు కట్టబెట్టడం అనేది జరుగుతుందనీ అన్నారు,
బీసీ సమాజానికి రాజకీయ అధికారం దక్కినప్పుడు మాత్రమే అసలైన అభివృద్ధి జరుగుతుందని, భారత రాజ్యాంగం అమలు జరుగుతుందని, సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీ సూర్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం నుంచి ఉంటారని సూర్యాపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు స్టాలిన్ అంబేద్కర్ బహుజన్ అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.