సూర్యాపేట కాంగ్రెస్ లో సంస్థాగత రగడ

సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లో అసమ్మతి చాప కింద నీరులా పాకుతుంది మాజీ మంత్రి టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విరివిరిగా చేస్తూనే వచ్చారు ఒకానొక సందర్భాలలో పార్టీ పరిధులు దాటుతున్నారు అంటూ బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే అయితే నియోజకవర్గంలో కూడా ఇద్దరు నాయకులు కలిసి రచ్చబండలో పాల్గొనలేదు పటేల్ తన అనుచరగణంతో మండలాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను ప్రజలకు వివరిస్తూ వచ్చారు దామన్న కూడా సూర్యాపేట మండలం ఎల్ల పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను తీసుకువచ్చి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే గత నాలుగు రోజుల క్రితం సూర్యాపేట పట్టణంలోని ఎనిమిదో వార్డు లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి పటేల్ వెళ్లగా అక్కడ స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ తనకు సమాచారం ఇవ్వకుండా తన వార్డులో రచ్చబండను నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటని పటేల్ వాహనానికి అడ్డుగా నిలబడి తన నిరసనను తెలియజేశారు చేసేదేమీలేక పటేల్ వెనుతిరిగ వలసిన పరిస్థితి ఏర్పడింది . ఇదంతా నాణానికి ఒకవైపు కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాల నమోదు ప్రక్రియ పూర్తి అయ్యి పార్టీ సంస్థాగత ఎన్నికకు తెర లేచింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికకు పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆసిఫ్ ఖాన్ ను నియమించింది గత రెండు రోజుల క్రితం పార్టీ పరిశీలకుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించారు కానీ ఆ సమావేశానికి పటేల్ వర్గీయులు ఎవరు హాజరు కాలేదు కానీ పటేల్ వర్గీయులు పరిశీలకుని కలవాలని ప్రయత్నించిన దామన్న వ్యూహాత్మకంగా వ్యవహరించి నేరుగా గా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి నేరుగా హైదరాబాద్ వెళ్లే అట్లు చేశాడు ఆరోజు పరిశీలకుని కలవాలనుకున్నా పటేల్ వర్గానికి మొండి చెయ్యి ఎదురైందని చెప్పాలి అయితే పటేల్ వర్గం తాజాగా హైదరాబాదులో ఉన్న ఆసిఫ్ ఖాన్ ను ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది అయితే మంగళవారం నిర్వహించనున్న సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఇరువర్గాలు హాజరు కావాల్సి ఉంది అయితే పటేల్ వర్గీయులు ఈ సమావేశానికి తప్పక రావాల్సిన పరిస్థితి ఇన్ని రోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోవాల్సిన పరిస్థితి.

చెయ్యి కలిపేనా చెరో దారిలో వేళ్లేనా !

సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అంతర్యుద్ధం రాజ్య మేలు తోందని చెప్పవచ్చు ప్రత్యర్థిని ఢీ కొట్టాలంటే ఇద్దరు నాయకులు ఏకమైతే కాంగ్రెస్ పార్టీకి విజయం సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు ఇక్కడ ఒక సినిమా డైలాగు గుర్తు రాక తప్పదు ఒక సినిమాలో జింకను వేటాడ డానికి పులి ఎంత ఓపికగా ఉంటుందో అదే పులి నీ వేటాడాలి అంటే ఎంత ఓపిక కావాలి అంటారు ఇక్కడ ఓపిక అంటే నాయకుల మధ్య ఐకమత్యంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి వరుసగా రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిని డి కొట్టాలంటే పై ఐక్యం కావాలని పార్టీ శ్రేణులు బాహాటంగానే అనుకుంటున్నారు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు మరో సంవత్సర కాలంలో జరగనున్న దృష్ట్యా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఐక్యమత్యం అవసరమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నొక్కి వక్కాణిస్తున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.