సూర్యాపేట లో కేంద్ర ప్రభుత్వ తీరు కు నిరసనగా ర్యాలీ

టి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి , గిరిజన లోకానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్

క్షమాపణలు చెప్పే వరకు తగ్గేదేలే అంటున్న గిరిజన మహిళలు

కేంద్ర మంత్రి బిశ్వేశ్వ‌ర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలంటూ డిమాండ్

జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు తమ వద్దకు చేరలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సూర్యాపేట గిరిజన లోకం భగ్గుమంటుంది.కేంద్రం తీరు ను నిరసిస్తూ గిరిజన సోదరీ సోదరమణులు ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నల్లా జెండాలు చేబట్టి కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఫ్లకార్డు లతో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం పీ.ఎస్.ఆర్ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా గిరిజన నేతలు మాట్లాడుతూ గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని తప్పుడు వ్యాఖ్యలు చేసిన బిశ్వేశ్వ‌ర్ ను పార్ల‌మెంట కేబినెట్ నుంచి బ‌ర్త‌రప్ చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే తెలంగాణ‌ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిరిజన సోదరులకు తెలుసన్నారు. బిల్లు తమ వద్దకు చేరిందని కేంద్ర హోంశాఖ కూడా అక్నాలెడ్జ్‌ చేసిందన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కూడా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పిందన్నారు.. ఇప్పుడేమో అసలు అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్దకు రానేలేదని పార్లమెంట్‌లో దారుణంగా అబ‌ద్ధ‌లాడటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులను అవమానించడమే అని అన్నారు.గిరిజనుల తో పెట్టుకున్న ఏ కేంద్ర ప్రభుత్వం బతికి బట్టకట్టలేదన్న నేతలు దేశ వ్యాప్తంగా లక్షలాది గా ఉన్న గిరిజన లోకాన్ని ఏకం చేసి కేంద్రం పై పోరు బాట చేస్తామని హెచ్చరించారు. తప్పుడు వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రభుత్వం అప నిందలు వేయడం మోడీ ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.రాష్టం లో ఉన్న ప్రతీ తాండా ను పంచాయితీ చేసిన ఘాన కీర్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.. టి.ఆర్.ఎస్ మినహా దేశంలో 6 మరే ప్రభుత్వం గిరిజనుల ను గుర్తించలేదని అన్నారు.ప్రధాని మడీ, గిరిజన మంత్రి బిష్వేశ్వర్ లు తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గిరిజన లోకానికి క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు.లేని పక్షం లో కేంద్ర ప్రభుత్వకార్యకలాపాలను స్తంభింప చేసి గిరిజన సత్తా చాటుతమని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన గిరిజనుల తో పాటు నేతలు చివ్వెంల ఎంపీపీ కుమారి బాబు,లంబాడి హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షులు బిక్షం నాయక్, ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు లచ్చిరాం నాయక్, చివ్వెంల ఎంపీపీ కుమారి బాబు, సర్పంచ్ లు బికారు, సేవాలాల్ నాయకులు నాగు నాయక్, అనిల్, కౌన్సిలర్ లు ధరావత్ కమల చంద్ర నాయక్,లింగా నాయక్, వాంకుడోతు వెంకన్న పద్మ,బాలాజీ నాయక్, భూక్య వీరన్న నాయక్,విజయ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.