సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు లో గుర్తుతెలియని మహిళ మృతదేహం..సాయంత్రం వేళ వాకింగ్ కి వచ్చిన పాదచారులు,స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సద్దల చెరువు ఒడ్డున ఉన్న మెట్ల పై రెండు జతల మహిళకు సంబంధించిన చెప్పులు ఉన్నాయి. చెరువులో ఒక్కరే దూకి ఆత్మహత్య చేసుకున్నారా,లేక ఇద్దరు దూకరా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒక మహిళ డెడ్ బాడీ మాత్రం నీళ్లపై తేలియాడుతుంది.